News April 6, 2024

KCR కరీంనగర్ పర్యటనలో దొంగతనం!

image

KNR జిల్లాలో శుక్రవారం KCR పర్యటించిన విషయం తెలిసిందే. అయితే KNR రూరల్ మండలం ముగ్దుంపూర్‌లో KCR పంట పొలాల సందర్శన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతివాటం చూపించారు. KCR పంట చేను వద్దకు రాగానే రైతులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికేందుకు రాగా.. అదే అదనుగా దొంగలు నాయకుల జేబుల నుంచి డబ్బు, సెల్ ఫోన్ మాయం చేశారు. వీరిలో ఒకరిని పట్టుకొని చితకబాది డబ్బు తిరిగి తీసుకున్నారు.

Similar News

News January 16, 2025

హుస్నాబాద్: కబడ్డీ ‘కోర్టు’ వేసి.. దానిపై ‘చితి’ని పేర్చి..

image

అక్కన్నపేట మండల చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ (43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పులికాశి సంపత్ కబడ్డీ క్రీడాకారుడు కావడంతో తోటి క్రీడాకారులు, చౌటపల్లి గ్రామస్థులు కలిసి సంపత్‌కు చెందిన వ్యవసాయ బావి వద్ద భూమిని చదును చేసి కబడ్డీ ‘కోర్టు’ వేసి దానిపై ‘చితి’ ని పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News January 16, 2025

జగిత్యాల: ఈ ఇందిరాభవన్ గురించి మీకు తెలుసా?

image

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ఈరోజు ప్రారంభించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఇందిరా భవన్ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీపై విధేయతకు చిహ్నంగా తన నివాస గృహానికి ఇందిరాభవన్‌గా నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భవనంలోనే సాదాసీదాగా నిత్యం తన వద్దకు వచ్చే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.

News January 16, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.