News April 18, 2024
KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న బాజిరెడ్డి
నిజామాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్‌లో KCR చేతుల మీదుగా B-ఫారమ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2024
బాల్కొండ: మిస్ అయిన బాలుడి హత్య..!
నాలుగు రోజుల క్రితం మిస్ అయిన బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి కచ్చు రాకేష్ (12) మృతదేహం శనివారం బాల్కొండలోని పురాతన ఖిల్లా వద్ద హత్యకు గురైన స్థితిలో లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లక్మయ్యల కుమారుడైన రాకేశ్ 4 రోజుల క్రితం అదృశ్యమవగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News September 14, 2024
కామారెడ్డి: జిల్లా అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు
కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ 2024లో నిర్వహించిన పోటీలలో లింగంపేట మైనారిటీ గురుకుల కళాశాల ఎంపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు కె. నితిన్, ఎస్‌డీ జునైద్ గోల్డ్ మెడల్ సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఏ. మధుసూదన్ రావు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను సన్మానించారు.
News September 14, 2024
NZB: కాకతీయ కాలువ పరివాహక ప్రాంత ప్రజలకు గమనిక
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ (LMD పైన) పరివాహక ప్రాంత ప్రజలకు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజనీర్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరిక జారీ చేశారు. కాకతీయ కాలువలో నీటి ప్రవాహం తిరిగి మొదలైనందున కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కనుక కాల్వ దరిదాపుల్లోకి ప్రజలు ఎవరూ రావద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.