News February 18, 2025
KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Similar News
News October 28, 2025
MBNR: FREE కోచింగ్.. రేపే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. CCTV కెమెరా ఇన్సాలేషన్ & సర్వీస్ కోర్సులో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు.. SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 29లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.
News October 28, 2025
అవసరం లేని రూట్లలో బస్సులు నిలిపివేయండి: RTC MD

AP: భారీ వర్షాల నేపథ్యంలో అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలివేయాలని అధికారులను RTC MD తిరుమలరావు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లోనే సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్లు ఉంచొద్దని, ముంపునకు అవకాశమున్న కాల్వలు, కాజ్ వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దన్నారు. దూరప్రాంత సర్వీసులనూ రద్దీని బట్టే నడపాలని చెప్పారు.
News October 28, 2025
పాలమూరు: బీ.ఫార్మసీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు నేడే లాస్ట్

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీ.ఫార్మసీ మిగిలిన 11 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులు నేడు మధ్యాహ్నం లోపు కళాశాల ఆఫీస్లో ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి, రూ.31,500 ఫీజు చెల్లించి సీటును ఖరారు చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు. గడువులోగా హాజరు కానివారి సీటు తర్వాతి వారికి కేటాయిస్తామన్నారు.


