News March 20, 2025

KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

image

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.

Similar News

News December 9, 2025

ఖమ్మం: వెంకటరెడ్డి ప్రస్థానం ఆదర్శనీయం

image

సర్పంచ్ ఎన్నికల వేళ దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి అభ్యర్థులకు ఆదర్శనీయం. పాత లింగాల సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, 1977లో ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సర్పంచ్‌గా పదేళ్లు పనిచేసి, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగారు. గ్రామాభివృద్ధికి నిబద్ధత ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు.

News December 9, 2025

విదేశీ విద్యకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ చేయూత

image

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన IELTS ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీలత తెలిపారు. శిక్షణతో పాటు స్కాలర్‌షిప్‌ పొందేలా మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News December 9, 2025

ఖమ్మం జిల్లాలో పడిపోయిన టెంపరేచర్

image

రెండు రోజులుగా వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 15 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు, చల్లని గాలుల ప్రభావం కనిపించింది. ఈ చలి కారణంగా ప్రజలు జలుబు, గొంతు నొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.