News February 1, 2025

KCR రైతు బంధు ఇవ్వలేదని బద్నాం చేయడం తగదు: హరీష్ రావు

image

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆనాడు PCC చీఫ్ రేవంత్ రెడ్డి ఉండి రైతు బంధును ఆపి, నేడు CM హోదాలో ఉండి KCR రైతుబంధు ఇవ్వలేదని బద్నాం చేస్తున్నారన్నారు. 2 రోజుల్లో రైతుల అకౌంట్లో రైతుబంధు డబ్బులు పడతాయని నవంబర్ 25, 2023 పాలకుర్తి పబ్లిక్ మీటింగ్‌లో నేను చెబితే, మరుసటి రోజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపలేదా ? అని ప్రశ్నించారు.

Similar News

News February 7, 2025

మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.

News February 7, 2025

గజ్వేల్‌లో యాక్సిడెంట్.. ఇద్దరి దుర్మరణం

image

గజ్వేల్ పరిధిలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గోదావరిఖని నుంచి HYD వైపు వెళ్తున్న కారు, ఆగి ఉన్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

News February 7, 2025

ఆత్మహత్యలు కాదు.. కొట్లాడుదాం.. ప్రజలకు హరీశ్ రావు పిలుపు

image

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగు మందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. ఆత్మహత్యలు వద్దు.. కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

error: Content is protected !!