News October 28, 2024
‘KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలి’
BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని PAC ఛైర్మన్ గా KCR నియమించారని మాజీ మంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ ఛైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని కోరారు. KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్ గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News February 3, 2025
NZB:100 మీటర్స్ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి 100 మీటర్ల హార్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా 40 ఏళ్ల పై కేటగిరిలో పల్లవి గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణకు చెందిన శివ లీల సిల్వర్ మెడల్, జయలక్ష్మి బ్రాంజ్ మెడల్ సాధించారు.
News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News February 3, 2025
NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా
నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.