News December 9, 2024

KCR అసెంబ్లీకి వస్తారో రారో.. మీరే చూస్తారు: హరీశ్‌రావు

image

నేటి నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. BRS MLAలు, MLCలతో పార్టీ అధినేత KCR ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సమావేశమయ్యారు. గురుకులాల బాట ద్వారా అధ్యయనం చేసిన నివేదికను RS ప్రవీణ్‌కుమార్‌, BRSV విభాగం అందజేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై KCR ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News November 7, 2025

మెదక్ పోలీస్ మైదానంలో వందేమాతరం గీతాలాపన

image

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందితో పాటు మెదక్ టౌన్, రూరల్, హవేలిఘనపూర్ పోలీసులు పాల్గొన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ తెలిపారు.

News November 7, 2025

మెదక్: చిల్డ్రన్ హోంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ చిల్డ్రన్ హోమ్ (బాలికల)లో పొరుగు సేవల పద్ధతిలో సేవిక, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోపు మెదక్ కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.

News November 6, 2025

డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.