News April 18, 2024

 KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న నామా 

image

ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో నామాకు B-ఫారమ్ అందుకున్నారు. మరోసారి గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల విలువచేసే చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు తదితరులున్నారు.

Similar News

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన ఖమ్మం జిల్లా

image

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో ఖమ్మం జిల్లా వాసులు సత్తా చాటారు. నీల శ్రీనివాసరావు (సత్తుపల్లి) SAసోషల్‌ 1వ ర్యాంక్, రెడ్డి మాధురి (కల్లూరు చిన్నకొరుకొండి)SGT 1వర్యాంక్, వలసాల ఉమా (కల్లూరు) SGT 2వ ర్యాంక్, ఈలప్రోలు సునీత (పోద్దుటూరు)3వ ర్యాంక్ SGT(SPL), చిల్లపల్లి రాధాకృష్ణ (కందుకూరు) SGT 7వర్యాంక్, మండవ ప్రియాంక (జీళ్లచెరువు)SGT 11వ ర్యాంక్, గొకేనెపల్లి పవిత్ర SGT 14వ ర్యాంక్ సాధించారు.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన భద్రాద్రి జిల్లా

image

ప్రభుత్వం నిన్న డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో భద్రాద్రి జిల్లా వాసులు సత్తా చాటారు. దమ్మపేటకి చెందిన మిద్దే హరికిరణ్‌కి ఎస్ఎ ఫిజీకల్ సైన్స్‌లో మెుదటి ర్యాంక్, భద్రాచలం ఎంపీకాలనీకి చెందిన పావురాల వినోద్ కృష్ణ ఎస్‌ఎ సోషల్‌లో 2వ ర్యాంక్, అశ్వారావుపేట మండలం వినాయకపురంకి చెందిన రొయ్యల గణేష్‌ ఎస్జీటీలో 3వ ర్యాంక్ సాధించాడు. దీంతో వారి గ్రామస్థులు వారిని అభినందించారు.

News October 1, 2024

ఖమ్మం గ్రీవెన్స్‌కు భారీగా వినతులు

image

ఖమ్మం గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.