News March 20, 2025
KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాజీ CM KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నీ తానే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ అభినందించారు.
Similar News
News March 20, 2025
ఖమ్మం: జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్: అ.కలెక్టర్

ఖమ్మంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని మీ సేవ ద్వారా జర్నలిస్టులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. అప్లై తరువాత రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 20, 2025
టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.
News March 20, 2025
ఖమ్మంలో ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. ఇవాళ జరిగిన పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ తెలిపారు. అటు జిల్లా వ్యాప్తంగా జనరల్ కోర్సుల్లో 16,446 మందికి గాను 15,939, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 1,719 మందికి గాను 1,576 మంది హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు సంబంధించి 650 మంది గైర్హాజరు హాజరైనట్లు పేర్కొన్నారు.