News November 13, 2024
KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS
మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.
Similar News
News November 21, 2024
సిద్దిపేట: కొత్త కానిస్టేబుల్స్‌కు అభినందనలు: హరీశ్‌రావు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికై విధుల్లో చేరబోతున్న 8,047 కానిస్టేబుళ్లకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు అభినందనలు తెలిపారు. నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ పోస్టులను భర్తీ చేశారని, వీటిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.
News November 20, 2024
MDK: మేనకోడలిపై అత్యాచారం.. వ్యక్తికి ఏడేళ్ల జైలు
మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మెదక్ జిల్లా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేల జరిమానా విధించింది. SP ఉదయ్ కుమార్ వివరాలు.. మెదక్‌కు చెందిన ఓ బాలిక తల్లి చనిపోవడంతో అమ్మమ్మతో కలిసి ఉంటోంది. అదే ఇంట్లో ఉంటున్న మేనమామ శ్రీనివాస్(40) బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
News November 20, 2024
సంగారెడ్డి: పీజీలో ప్రవేశాలకు నేడు ఆఖరు
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల పీజీ సెంటర్‌లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపల్ రత్నప్రసాద్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20 చివరి తేదీ అని పేర్కొన్నారు. పీజీ వివిధ విభాగాల్లో మిగిలిన సీట్లలో అడ్మిషన్లు పొందేందుకు డిగ్రీ టీసీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, ఒక జిరాక్స్ సెట్‌తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.