News October 28, 2024

‘KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలి’

image

BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని PAC ఛైర్మన్ ‌గా KCR నియమించారని మాజీ మంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ ఛైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని కోరారు. KCR సూచించిన వారిని పీఏసీ ఛైర్మన్ ‌గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News February 2, 2025

NZB: దిల్ రాజుకు ఆహ్వానం

image

నిజామాబాద్‌లో వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఆదివారం వారాహి మాత ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 10న ఆలయ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని వివరించారు.

News February 2, 2025

లింబాద్రి గుట్ట స్వామిని దర్శించుకున్న శ్రీముఖి

image

భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.

News February 2, 2025

ఆర్మూర్: ఇది సకల జనుల బడ్జెట్: కలిగోట్ గంగాధర్

image

ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు ఆమోదయోగ్యంగా ఉందని BJP జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని, మధ్య తరగతి వారికి పన్ను భారం తగ్గిందని, రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రద్దు చేశారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.