News April 20, 2024
కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: ఎంపీ లక్ష్మణ్

TG: వికసిత్ భారత్ తరహాలోనే వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, BRSకు భవిష్యత్తు లేదన్నారు. సీఎం రేవంత్ పాలన ఓటమికి దారులు వెతుక్కుంటున్నట్లు ఉందన్నారు.
Similar News
News February 6, 2026
మచిలీపట్నం హైవే కారిడార్‌కు ఫండ్స్.. గడ్కరీకి లోకేశ్ థాంక్స్

AP: మచిలీపట్నం పోర్టు రోడ్డును NH-216 జంక్షన్‌కు అనుసంధానించే 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి గడ్కరీ SMలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పోర్టు నుంచి హైవేకు సరకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం సహకరిస్తున్న గడ్కరీకి ధన్యవాదాలు అని ఆయన పోస్ట్‌కు మంత్రి లోకేశ్ రిప్లై ఇచ్చారు.
News February 5, 2026
గుండెపోటు రావొద్దంటే ఇవి తినాల్సిందే!

ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అవి బ్లాక్ అయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టమాటాల్లోని విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవరూ ఎంతగానో దోహదపడతాయి. చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
News February 5, 2026
ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO

TG: రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో SIR నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఇవాళ ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్(BLA)ను నియమించుకోవాలని పార్టీలకు సూచించారు. 2025 జాబితాలో ఉన్న ఓటర్లను 2002 SIRలో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు.


