News March 31, 2024

రైతుకు ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్

image

TG: ‘పొలంబాట’లో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు. ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అని ఓ రైతు కేసీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అధినేత ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Similar News

News April 6, 2026

TODAY HEADLINES

image

*ఎన్నికల్లో గెలిచాక టీఎంసీ పాపాల లెక్క తేలుస్తాం: మోదీ
*నీటి సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్: CBN
*కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్
*అసలు సినిమా ముందుంది: రాఘవ్ చడ్ఢా
*హార్ముజ్‌ను దాటిన 9వ భారత నౌక
*డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్
*IPL: SRHపై LSG, చెన్నైపై బెంగళూరు గెలుపు

News April 6, 2026

ఫైటర్ జెట్ కూలిపోయింది కానీ పైలట్లు సేఫ్: US

image

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమ <<19559906>>F-15E<<>> ఫైటర్ జెట్ కూలిపోయిందని అమెరికా ధ్రువీకరించింది. అందులోని ఇద్దరు పైలట్లు ఇరాన్ భూభాగంలో పడిపోగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి విజయవంతంగా వారిని రక్షించామని తెలిపింది. ఇరాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా పైలట్లను రక్షించే క్రమంలో అమెరికా పలు ఎయిర్ క్రాఫ్ట్‌లను కోల్పోయింది.

News April 6, 2026

డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్‌లైన్‌ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్‌నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.