News June 25, 2024
విద్యుత్ కమిషన్పై హైకోర్టులో KCR పిటిషన్

TG: విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో BRS అధినేత KCR రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
Similar News
News December 3, 2025
దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

దేవరకొండ, గాంధీనగర్లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.
News December 3, 2025
రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్లో జరగనుంది.
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా


