News March 12, 2025
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.
Similar News
News March 12, 2025
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు: లాయర్లు

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మర్డర్ కేసుల్లోనే మహిళలకు బెయిల్ లభిస్తోందని, అలాంటప్పుడు బెయిల్ పొందడానికి రన్యా కూడా అర్హురాలని వాదనలు వినిపించారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి నడుము చుట్టూ, కాళ్ల కింద భాగం, షూలో 14 కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.
News March 12, 2025
పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.
News March 12, 2025
కళ్లు పొడిబారుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. బ్లూలైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం బెటర్.