News April 20, 2024

కవిత బెయిల్ కోసం మోదీతో KCR బేరసారాలు: పొన్నం

image

TG: తన కుమార్తె కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు ప్రధాని మోదీతో KCR బేరసారాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే BRS, BJP ఓర్వలేకపోతున్నాయి. కరీంనగర్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌ను బలిపశువు చేశారు. బండి సంజయ్ హిందువుల పేరు మీద ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News January 20, 2026

జగిత్యాలకు మహర్దశ.. నేడే శంకుస్థాపన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల నూతన ఆసుపత్రికి నేడు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరవుతారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. మాతా శిశు, మెడికల్ కాలేజీ సమీపంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.

HEADLINES

image

* ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM CBN
* TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు
* AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్
* TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు
* TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌కు తప్పుడు కేసులో నోటీసులు: KTR
* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక
* భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు