News April 20, 2024
ఈనెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 11, 2026
ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
నేడు కేరళ, తమిళనాడుకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో ₹10,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం TNలోని తిరుచిరాపల్లిలో ₹5,650కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందే మధురై ఎయిర్‌పోర్టుకు కేంద్రం అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఈ విజిట్‌తో మోదీ ఇరు రాష్ట్రాల్లో అధికారికంగా NDA ఎన్నికల ఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది.


