News April 25, 2024
రేపటి నుంచి KCR బస్సు యాత్ర

TG: రేపటి నుంచి కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం HYD తెలంగాణ భవన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో జరిగే రోడ్‌షోలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్‌షోలో మాట్లాడనున్నారు. మే 10వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
Similar News
News December 29, 2025
సీరియల్ నటి నందిని ఆత్మహత్య

ప్రముఖ కన్నడ-తమిళ్ సీరియల్ నటి నందిని(26) సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్లో పాపులర్ అయిన ‘గౌరీ’ సీరియల్లో దుర్గ, కనకగా ఆమె డబుల్ రోల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి చేయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
News December 29, 2025
మున్సిపల్ ఎన్నికలు.. JAN 10న ఓటరు జాబితా

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది. JAN 1న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
News December 29, 2025
పుతిన్ ఇంటిపై దాడికి ఉక్రెయిన్ యత్నం: రష్యా

అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ‘91 లాంగ్ రేంజ్ డ్రోన్స్‌తో మా ప్రెసిడెంట్ ఇంటిపై ఉక్రెయిన్ నిన్న, ఇవాళ దాడికి ప్రయత్నించింది. వాటిని మా రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఇలాంటి చర్యలకు తప్పక సమాధానం చెప్పి తీరుతాం’ అని ఆయన హెచ్చరించారు. అయితే ఆ టైమ్‌లో పుతిన్ ఇంట్లో ఉన్నారా లేదా అనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.


