News May 15, 2024
రాష్ట్ర వ్యాప్త నిరసనలకు KCR పిలుపు

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను ఖండిస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. క్వింటా వరి ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
Similar News
News February 2, 2026
బ్రాండ్లు వేరైనా.. యజమాని ఒక్కరే

మార్కెట్‌లో వేర్వేరు బ్రాండ్ల మధ్య పోటీ ఉందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు మన డబ్బు ఒకే సంస్థ జేబులోకి వెళ్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఉదాహరణకు అప్సర, నటరాజ్.. రెండు పెన్సిల్స్ ఒకే సంస్థవి. లక్స్, లైఫ్‌బాయ్ సబ్బులు కూడా హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు చెందినవి. ఆడి, స్కోడా కార్లు వోక్స్‌వ్యాగన్ గ్రూపువి. ప్రతి రకమైన కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ స్ట్రాటజీని వాడుతాయి.
News February 2, 2026
900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్‌ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 2, 2026
ఐసీసీ టోర్నీల్లో గతంలోనూ బహిష్కరణలు

భారత్‌తో జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలలో మ్యాచ్‌లు రద్దవ్వడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996 వరల్డ్‌కప్‌లో భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడేందుకు ఆసీస్, వెస్టిండీస్ నిరాకరించాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. 2003 WCలో జింబాబ్వేతో మ్యాచ్‌ను ఇంగ్లండ్, కెన్యాతో మ్యాచ్‌ను న్యూజిలాండ్ బహిష్కరించాయి.


