News June 2, 2024
విపక్షంలో కూర్చున్నా KCRకు జ్ఞానోదయం కలగలేదు: నారాయణ

తెలంగాణ సాధనలో ఎంతో మంది పాత్ర ఉన్నప్పటికీ పేటెంట్ రైట్స్ KCRకే దక్కాయని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘పదేళ్లు పాలించిన KCR నీరు, నిధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రాన్ని కాకుండా కుటుంబసభ్యులను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్నా ఆయనకు జ్ఞానోదయం కలగలేదు’ అని ఫైరయ్యారు.
Similar News
News December 7, 2025
రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.
News December 7, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత
News December 7, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<


