News March 29, 2024

31న కేసీఆర్ జిల్లాల టూర్

image

TG: ఈ నెల 31న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Similar News

News November 18, 2025

కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

image

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్‌-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.