News August 2, 2024

వర్గీకరణ కోసం కేసీఆర్ ఎప్పుడో డిమాండ్ చేశారు: హరీశ్

image

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్వాగతించారు. వర్గీకరణ డిమాండ్‌ను తమ అధినేత కేసీఆర్ ఏనాడో తెరపైకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘వర్గీకరణ సమస్య పరిష్కారంపై ఉద్యమ సమయం నుంచే మా పార్టీ పోరాడుతోంది. రాష్ట్రంలో తొలి శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేశాం. ప్రతి సందర్భంలోనూ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!

image

ఇవాళ మనం జరుపుకుంటున్న భోగి ఎంతో విశిష్టమైంది. నేడు షట్తిల ఏకాదశి. భోగి పండగ రోజు ఏకాదశి తిథి రావడమే దీని ప్రత్యేకత. ఇలా మళ్లీ 2040 వరకు జరగదు. షట్తిల ఏకాదశి రోజు నువ్వులు దానం చేయాలి. వీటితో పాటు బెల్లం, దుస్తులు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు దానమిస్తే మంచిది. ఇవాళ ఉపవాసం ఉంటే భగవంతుడి కృపతో కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.

News January 14, 2026

సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేయాలి?

image

సంక్రాంతికి వేసే ‘రంగవల్లి’ అంటే రంగుల వరుస అని అర్థం. ఇంటి ముంగిట ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమే కాదు, బియ్యప్పిండితో వేయడం వల్ల మూగజీవాలకు ఆహారం కూడా లభిస్తుంది. ముగ్గుల్లోని జ్యామితీయ ఆకృతులు చూసేవారి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వంగి ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో వాడే రంగులు సంపదకు, బలానికి సంకేతాలుగా నిలుస్తూ, ఇంటికి శుభాలు చేకూరుస్తాయి.

News January 14, 2026

రూ.15,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.