News April 5, 2025
రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చింది.. ప్రభుత్వంపై KCR ఫైర్

TG: HCU భూముల ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని, దాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు చేతగావడం లేదని మండిపడ్డారు. HCU అంశంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో HCU విద్యార్థులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.
Similar News
News April 6, 2025
ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
News April 6, 2025
కాంగ్రెస్, BRS పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది BJPయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. HYDలో BJP ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, KCR కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. INC, BRS పార్టీల కుట్రలు, నిజస్వరూపాన్ని బయటపెట్టి BJPని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News April 6, 2025
మార్కెట్ క్రాష్‌ను జయించిన వృద్ధుడి చాతుర్యం

టారిఫ్స్ ఎఫెక్ట్‌తో స్టాక్‌మార్కెట్స్ క్రాష్ అయి మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ తదితర కుబేరులు రూ.కోట్ల సంపద కోల్పోయారు. అయితే టాప్10 బిలియనీర్ల జాబితాలో 94 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రమే $12.7B లాభాలతో మార్కెట్ పతనాన్ని జయించారు. కన్జూమర్ గూడ్స్, ఎనర్జీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ షేర్స్ అమ్మేసి షార్ట్ టర్మ్ US ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్స్.