News September 17, 2024

రేవంత్ కదలికలపై KCR ఫోకస్!

image

TG: కొంతకాలంగా తన ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న మాజీ CM, BRS అధినేత KCR సీఎం రేవంత్ కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. HYD పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులను పదేపదే బదిలీ చేయడం రేవంత్ అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తోందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. అటు కరోనా సమయంలోనూ కొనసాగించిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని ఆయన విమర్శించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

Similar News

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

image

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.

News December 5, 2025

టిఫా స్కాన్‌లో ఏం చెక్ చేస్తారంటే?

image

టిఫా అంటే.. టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్‌ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్‌ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.