News April 12, 2024

వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చిన KCR

image

TG: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన గులాబీ బాస్.. తాజాగా డా.మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు.

Similar News

News March 4, 2026

టాప్ సెల్లింగ్ కార్‌గా డిజైర్!

image

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్‌లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.

News March 4, 2026

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్‌గా ఖమేనీ కుమారుడు!

image

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 4, 2026

నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్‌ బెర్త్ ఎవరిదో?

image

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్‌రేట్ కలిసొచ్చి సెమీస్‌కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్‌ రికార్డ్‌లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.