News April 5, 2024
పొలంలో కేసీఆర్.. స్టేడియంలో రేవంత్: BRS
TG: మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న CSK, HYD మ్యాచును వీక్షిస్తున్నారు. దీంతో ఇద్దరి ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ రైతుల సమస్యలు తెలుసుకుంటుంటే, రేవంత్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
Similar News
News February 5, 2025
సంగారెడ్డి: అర్ధరాత్రి అరెస్టుల దుమారం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలంలో అర్ధరాత్రి అరెస్టుల దుమారం నెలకొంది. స్థానిక నల్లవల్లి అటవీ ఫారెస్టులో నూతనంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోని మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు బీఆర్ఎస్ నాయకులు, గోవర్దన్ రెడ్డి, కుమార్ గౌడ్ మంగళవారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉలిక్కిపడిన ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్థులు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.