News January 5, 2025
కేసీఆర్ రైతు బంధువు.. రేవంత్ రాబంధు: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని రైతులు ఎప్పటికీ క్షమించరని KTR అన్నారు. ‘రైతు భరోసా కింద ₹15వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు ₹12వేలే ఇస్తామంటూ మోసం చేశారు. BRS ప్రభుత్వం ₹10వేలు ఇస్తే అప్పుడు బిచ్చం అన్నారు. మరి ఇప్పుడేం అనాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, కాంగ్రెస్ నేతల మానసిక స్థితి సరిగా లేదు. KCR రైతు బంధువుగా, రేవంత్ రాబంధుగా చరిత్రలో మిగిలిపోతారు’ అని ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు.
Similar News
News November 25, 2025
‘సచివాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వండి’

AP: గ్రామ సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం చేసి వచ్చే మార్చి నాటికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు, అధికారులకు సూచించారు. వారికి ప్రమోషన్లు, ఇతర శాఖల్లో అనుసంధానించడంపై సమీక్షించారు. పదోన్నతులు కల్పించినా సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ముందుకెళ్లాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రతినెలా సమావేశం అవుదామని చెప్పారు.
News November 25, 2025
AIపై ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలి: JNTU వీసీ

అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో మంగళవారం “Seminar on AI and IoT in Engineering Education” అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. AIపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.
News November 25, 2025
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 701 మంది విద్యార్థులు గైర్హాజరు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 10,856 మంది విద్యార్థులకు గాను 10,155 మంది విద్యార్థులు హాజరు కాగా 701 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిజామాబాద్లో పలు పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించినట్లు తెలిపారు.


