News February 4, 2025

KCR, KTRకి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపీ వివేక్

image

అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానందను ప్రకటించిన సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ ప్రతిష్ఠను పెంచేలా పని చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

టీటీడీ డబ్బుల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి: వైఎస్ జగన్

image

TTD డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్‌ బ్యాంకుల్లో జమ చేయకూడదని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘CBN హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్‌ బ్యాంక్‌లో పెట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును విత్‌ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత 3 నెలలకు ఎస్‌ బ్యాంక్‌ ఆర్థికంగా కుదేలయ్యింది. ఆ రూ.1,300 కోట్లు ఎస్‌ బ్యాంక్‌లోనే ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్‌?’ అని ప్రశ్నించారు.

News December 5, 2025

నల్గొండ: ఈ ఎన్నికలు మార్పునకు నాంది కావాలి..!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు బాధ్యతలతో కూడినవి. అభివృద్ధి పేరుతో అప్పుల్లో కూరుకుపోయిన సర్పంచ్‌లు అనేకం. ఓటుకు నోటు ఇస్తే నిజాయతీ నాయకులు ఎదగరు. అభ్యర్థులు డబ్బులు, మద్యం పంచే చెడు పద్ధతులను మానుకోవాలి. ఓటర్లు కూడా డబ్బు కోసం ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారు. విలువలున్న వ్యక్తులనే ఎన్నుకుంటేనే గ్రామాల్లో నిజమైన మార్పు సాధ్యం. 2025 ఎన్నికలు మార్పునకు నాంది కావాలి.. ఓ పల్లె ఓటరా ఆలోచించు..!