News February 4, 2025
KCR, KTRకి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపీ వివేక్

అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానందను ప్రకటించిన సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ ప్రతిష్ఠను పెంచేలా పని చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
సిరిసిల్ల: అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి: ఎస్పీ

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.
News February 18, 2025
CMను ఆహ్వానించింన MLA బొజ్జల

తిరుపతి పర్యటకు వచ్చిన CM చంద్రబాబుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని CMను ఆహ్వానించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ అధికారులు పాల్గొన్నారు.
News February 18, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ బిడ్డలు

సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో విద్యార్థులు శ్వేత, నిఖిత, అమూల్య, ప్రభాస్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ మిట్ట వెంకటస్వామి, పీడీ ధర్మారావ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు.