News February 4, 2025
KCR, KTRకి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపీ వివేక్

అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానందను ప్రకటించిన సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ ప్రతిష్ఠను పెంచేలా పని చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
నల్గొండ: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 1,781 గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం జీతాలు, జీపీల మెయింటెనెన్స్ లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
News November 11, 2025
రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్‌పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.


