News April 1, 2024

చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్: కేటీఆర్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను నంబర్-1గా నిలబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్-1. అయినా ఏం చేశావు కేసీఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి. జై తెలంగాణ’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News April 4, 2026

బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

image

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూడిల్స్‌, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

News April 4, 2026

₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN

image

AP: అమరావతి నిర్మాణాలను గడువులోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని CM చంద్రబాబు సంస్థలను ఆదేశించారు. ‘రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. ఈ నిర్మాణాన్ని కాంట్రాక్టు వర్కుగా చూడొద్దు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 20వేల మంది కార్మికులు, నిపుణులకు అదనంగా మరింత మందిని నియమించాలి’ అని సూచించారు. YCP రద్దు చేసిన పనులనూ సమస్యలు పరిష్కరించి పూర్తి చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2026

వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.