News February 4, 2025

KCR, KTRకి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపీ వివేక్

image

అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానందను ప్రకటించిన సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ ప్రతిష్ఠను పెంచేలా పని చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2025

మీరు గొప్పవారు సర్..

image

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.

News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

News March 14, 2025

బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

image

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

error: Content is protected !!