News April 5, 2025
ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News December 2, 2025
దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.
News December 2, 2025
టికెట్ ధరల పెంపు.. నెటిజన్ల ఆగ్రహం!

APలో ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల <<18450771>>పెంపునకు<<>> ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు పెంచుకుని ఇలా ప్రేక్షకులపై భారం మోపడం కరెక్ట్ కాదని అంటున్నారు. రేట్లు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 2, 2025
EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.


