News September 2, 2025

‘కాళేశ్వరం’ అవినీతికి KCR బాధ్యత వహించాల్సిందే: TPCC చీఫ్

image

TG: కవిత మాటలతో ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగినట్లు తేలిపోయిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న KCR అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. వాటాల పంపకాల్లో తేడాతోనే అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. ఎవరి వాటా ఎంతనేది CBI విచారణలో తేలుతుంది. వేగవంతంగా విచారణ చేయకుండా సాగదీస్తే BJP, BRS ఏకమయ్యాయని నిరూపితమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News September 21, 2025

మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

image

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.

News September 21, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 70 పోస్టులు

image

<>భారత్ <<>>ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 70 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్/ME/MTech, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు SEP 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

News September 21, 2025

ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్‌లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలకు దిగారు.