News September 6, 2024

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ నవగ్రహ మహాయాగం

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా KCR 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే.

Similar News

News December 1, 2025

సిద్దిపేట: సమస్యాత్మక గ్రామాల్లో నిఘా

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించాలని వివరిస్తున్నారు. ఆదివారం గజ్వేల్, మిరుదొడ్డి, అక్బర్పేట్-భూంపల్లి మండలాల్లో ACPల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలను జాగృతం చేశారు.

News December 1, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/

News December 1, 2025

బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 26,325, సెన్సెక్స్ 86,159 పాయింట్లతో ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60K మార్క్ క్రాస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 26,285 వద్ద, సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 86,020 వద్ద కొనసాగుతున్నాయి. బెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ITC నష్టాల్లో ట్రేడవుతున్నాయి.