News August 29, 2024

మరోసారి ప్రజల్లోకి కేసీఆర్!

image

TG: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలతో ప్రజల్లోకి రానున్నారని BRS శ్రేణులు అంటున్నాయి. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News January 31, 2026

కోళ్లలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు – నివారణ

image

కోడి పిల్లల్లో సాల్మొనెల్లా పుల్లొరం బ్యాక్టీరియా వల్ల తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.

News January 31, 2026

కాలంలో విత్తనాలు కలలోనైనా పోయాలి

image

వ్యవసాయంలో విత్తనాలు చల్లడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది దాటిపోతే ఎంత కష్టపడినా పంట పండదు. కాబట్టి ఏవైనా అడ్డంకులు వచ్చినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పనిని అస్సలు విస్మరించకూడదు. అలాగే మన నిజ జీవితంలో కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. వాటిని మనం సకాలంలో అందిపుచ్చుకోవాలి. లేదంటే అవి చేయిదాటిపోయాక పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 31, 2026

‘శని త్రయోదశి’ ఎందుకింత పుణ్యమైనది?

image

శనివారం, త్రయోదశి తిథి కలిసిన రోజును ‘శని త్రయోదశి’ అంటారు. శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది శనివారం. అలాగే ఈ వారానికి ఆయనే అధిపతి. అందుకే ఈ రోజుకు విశేష శక్తి ఉంటుంది. అలాగే త్రయోదశి శివుడికి ఇష్టం. శనివారం విష్ణువుకు ప్రీతికరమైనవి. ఈ కలయిక వల్ల శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నేడు వీరికి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.