News July 5, 2025

ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

image

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

Similar News

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.

News July 5, 2025

PF అకౌంట్లో వడ్డీ జమ చేసిన EPFO

image

దేశంలోని కోట్లాది మంది PF ఖాతాదారులకు EPFO శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బును జమ చేసింది. PF ఖాతాలో ఉన్న ఎంప్లాయి, ఎంప్లాయర్ షేర్ డబ్బుపై <<16496950>>8.25శాతం<<>> వడ్డీకి తగినట్లు ఈ డబ్బును జమ చేసింది. PF ఖాతాదారుల పాస్‌బుక్‌లో 31/03/2025 నాడు ఈ వడ్డీ జమ చేసినట్లు అప్‌డేట్ అయ్యింది. మీ ఖాతాలోనూ PF వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? చెక్ చేసుకోండి.

News July 5, 2025

రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు

image

TG: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. 175 కాలేజీల్లో 1.18 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా, తొలి విడత కౌన్సెలింగ్‌లో పెరిగిన సీట్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుండగా, అప్పటిలోగా పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.