News September 13, 2024

కౌశిక్ ఏపీ, తెలంగాణ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: గాంధీ

image

TG: రెచ్చగొట్టడం వల్లే కౌశిక్‌రెడ్డి వంటి చిల్లర వ్యక్తితో తాను గొడవకు దిగాల్సి వచ్చిందని శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ చెప్పారు. ‘కౌశిక్ ఎంతో మందిని మోసం చేసిన చీటర్. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలను అతడు రెచ్చగొట్టడంపై BRS నాయకత్వం ఏం సమాధానం ఇస్తుంది? మాజీ సీఎం KCR దీనిపై స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News November 1, 2025

నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

image

1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం (ఫొటోలో ఎడమవైపు)
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం

News November 1, 2025

RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

image

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.