News April 2, 2024
కేసీఆర్ గౌరవం నిలుపుకోవాలి: మంత్రి తుమ్మల

TG: కాంగ్రెస్ 100 రోజుల పాలనపై విపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. వేసవిలో తాగునీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయన్నారు. కేసీఆర్ గౌరవం నిలుపుకోవాలని సూచించారు. పంట బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని పాలిస్తామని అన్నారు.
Similar News
News March 20, 2026
30 ఏళ్లు దాటాయా.. చర్మ సౌందర్యానికి చిట్కాలు

వయసు 30 ఏళ్లు దాటాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం కూడా మంచిది.
News March 20, 2026
బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే..

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీలో తల్లి శార్డైన్స్, గుమ్మడి గింజలు, పాలకూర, బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు, బ్రెజిల్ నట్స్, పల్లీలు, అవకాడో,గ్రీక్ యోగర్ట్ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, అయోడిన్ పిల్లల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుందంటున్నారు.
News March 20, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘<<19423814>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు ₹37.17 కోట్లుగా నమోదైనట్లు Sacnilk వెబ్‌సైట్ వెల్లడించింది. దీంట్లో ₹31.50 కోట్లు నెట్ వసూళ్లని తెలిపింది. పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు.


