News July 16, 2024
KCR చతురత చాటారు: BRS శ్రేణులు

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై KCR ఒకింత విజయం సాధించారనే భావన BRS శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీన్ని రద్దు చేయాలన్న ఆయన పిటిషన్ విచారణలో నరసింహపై సుప్రీంకోర్టు నేడు ఘాటు <<13639787>>వ్యాఖ్యలు<<>> చేసింది. విచారిస్తూనే జూన్ 11న ఎలా మీడియాతో మాట్లాడుతారని CJI జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. KCR సైతం దీన్నే తప్పుబట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సుప్రీం దీన్ని అంగీకరించడం KCR చతురతకు నిదర్శనమంటున్నారు.
Similar News
News March 13, 2025
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.
News March 13, 2025
KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.