News August 4, 2024
ఎమ్మెల్యే సబితతో కేసీఆర్ చర్చలు!

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ <<13746535>>వ్యాఖ్యలతో<<>> సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.
Similar News
News October 23, 2025
‘అగ్నివీర్’ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం?

‘అగ్నివీర్’పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రిటెన్షన్ రేటును 25% నుంచి 75 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్ (రాజస్థాన్)లో ఈ రోజు మొదలయ్యే ఆర్మీ కమాండర్ల సమావేశంలో చర్చిస్తారని సమాచారం. మిషన్ సుదర్శన్ చక్ర అమలు, త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచడం వంటివి మీటింగ్ అజెండాలో ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్స్ 4ఏళ్ల పదవీకాలం 2026లో పూర్తి కానుంది.
News October 23, 2025
జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News October 23, 2025
ESIC నోయిడాలో కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు

ESIC నోయిడా 20 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, డీఎన్బీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://esic.gov.in/