News June 7, 2024
KCR అనుకున్నారు.. CBNకు సాధ్యమైంది!

కేంద్రంలో చక్రం తిప్పాలని BRS చీఫ్ KCR కలలు కన్నారు. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలో ఘనవిజయం సాధించిన TDP అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారారు. బీజేపీకి సరిపడా ఆధిక్యం రాకపోవడంతో 16 సీట్లతో CBN కింగ్ మేకర్ అయ్యారు. ఆయన మద్దతుతోనే ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని NDA అధికారం చేపట్టబోతోంది.
Similar News
News December 21, 2025
రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

TG: సీఎం రేవంత్ రేపు HYDలోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 21, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.260గా ఉంది. విజయవాడలో రూ.250, విశాఖ రూ.260, కామారెడ్డి రూ.250, నంద్యాల రూ.220-250, భీమవరంలో రూ.270గా ఉంది. కిలో మటన్ రూ.800-రూ.1000 వరకు పలుకుతోంది. అటు కోడి గుడ్ల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ఒక గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 21, 2025
శ్రీసత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <


