News September 3, 2024
KCR ₹2వేల కోట్లు విరాళం ఇవ్వాలి: CM

TG: KCR కుటుంబం దగ్గర ₹లక్ష కోట్లు ఉన్నాయని, CMRFకు ₹2వేల కోట్లు నిధులివ్వాలని CM రేవంత్ అన్నారు. చిట్‌చాట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విపత్తుపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. వరదల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదరను ఆదేశించినట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయన్నారు.
Similar News
News November 22, 2025
బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం

B:మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్‌రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, బీన్స్ ఎక్కువగా, చికెన్, జొన్న, గోధుమ, టమాటా, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్లు, సోయా తక్కువగా తీసుకోవాలి. AB: కెఫిన్, ఆల్కహాల్, వేపుళ్లు తక్కువగా, పాల ఉత్పత్తులు, టోఫు, సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. O: వీరు అధిక ప్రొటీన్ తీసుకోవాలి. గోధుమ పిండి, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

యాషెస్: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 2 పరుగులకే ఓపెనర్ క్రాలే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్ సేన 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్సులో ENG 172 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే.
News November 22, 2025
శబరిమల దర్శనాలు.. కేరళ హైకోర్టు కీలక నిర్ణయం

శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్స్‌పై విధించిన <<18335976>>ఆంక్షలను<<>> కేరళ హైకోర్టు సడలించింది. ట్రావెన్‌కోర్ బోర్డు, పోలీస్ చీఫ్ కలిసి రద్దీని బట్టి బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఇటీవల స్పాట్ బుకింగ్స్‌ను 20K నుంచి 5Kకు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నీలక్కల్ దగ్గర బుకింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్ బుకింగ్‌తో రోజూ 70K మందికి దర్శనం కల్పిస్తున్నారు.


