News February 3, 2025

త్వరలోనే గజ్వేల్‌లో కేసీఆర్ భారీ సభ!

image

TG: ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.

Similar News

News March 9, 2026

PHOTOS: టీమ్‌ఇండియా సంబరాలు

image

2023 ODI WC ఓడిన చోటే(అహ్మదాబాద్ స్టేడియం) టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ గ్రౌండ్ కలిసిరాదని చాలా మంది గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారత జట్టు విజయకేతనం ఎగరవేసింది. ట్రోఫీ అందుకున్న అనంతరం ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News March 9, 2026

ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!

image

చీకటిని చీల్చి నిప్పులు కక్కుతూ సూర్యుడెలా ఉదయిస్తాడో సంజూ అలా వెలిగాడు ఈ WCలో. తొలుత జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందలేదు. తనకూ ఛాన్స్ వస్తుందనే ఓపికతో ముందుకు సాగారు. నిరీక్షణకు తెరపడగానే సింహంలా గర్జించారు. అది ఎంతలా అంటే 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా. IND జట్టు కప్పును ముద్దాడేలా. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఓటమిని ఒప్పుకోకుండా సంజూలా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాలి. ఏమంటారు?

News March 9, 2026

ఇంట్లో 5-6 మంది ఉంటే ట్రిపుల్ బెడ్ రూమ్: CM CBN

image

AP: సంక్షేమ పథకాల్లో పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యమిస్తామని CM CBN అన్నారు. ‘ఇంట్లో 5-6 మంది ఉంటే ట్రిపుల్ బెడ్ రూమ్ ఇస్తాం. అవసరమైతే అదనపు పెన్షన్ ఒకటి ఇస్తాం. కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల వరకూ రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’ అని మహిళా దినోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. గ్యాస్ ధరలు పెరిగినా 3 సిలిండర్లు ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలవుతుందన్నారు.