News July 25, 2024
నాడు కేసీఆర్.. నేడు రేవంత్రెడ్డి

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా ఈనెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అయితే తెలంగాణ సీఎం ఇలా చేయడం ఇది రెండోసారి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులివ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను గతంలో కేంద్రం పట్టించుకోలేదు. దీంతో 2022లో అప్పటి సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.
Similar News
News November 2, 2025
ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.
News November 2, 2025
FINAL: టాస్ ఓడిన భారత్

WWCలో నేడు భారత్తో జరగాల్సిన ఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమ్ ఇండియా: షెఫాలీ వర్మ, స్మృతి మందాన, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్(C), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
సౌతాఫ్రికా: లారా (C), బ్రిట్స్, బాష్, సునే లుస్, కాప్, జఫ్టా, డ్రెక్సెన్, ట్రైయాన్, డి క్లెర్క్, ఖాక, మ్లాబా.
News November 2, 2025
ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

ప్రయాణాల్లో వాంతులు అవడం అనేది సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య. వికారంగా అనిపించడం, తల తిరగడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం ఇవన్నీ మోషన్ సిక్నెస్ లక్షణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్ సమస్యను మరింత పెంచుతాయి.


