News April 27, 2024
తొలి ట్వీట్ చేసిన కేసీఆర్
TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ట్విటర్(ఎక్స్) ఖాతా నుంచి తొలి పోస్ట్ పెట్టారు. ‘బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేసీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ఉద్యమం నాటి ఫొటోను జతచేశారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు.
Similar News
News January 2, 2025
రోహిత్ శర్మకు అవమానం?
BGT ఐదో టెస్టుకు రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించినట్లు TIMES OF INDIA తెలిపింది. ఇదే నిజమైతే ఫామ్ లేమి కారణంగా సిరీస్ మధ్యలో జట్టులో స్థానం కోల్పోయిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ నిలవనున్నారు. దీంతో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ను ఇలా అర్ధాంతరంగా తప్పించి అవమానిస్తారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కీలక మ్యాచుకు ముందు రెగ్యులర్ కెప్టెన్ను తప్పించడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News January 2, 2025
ట్రెండింగ్.. “RIP GAUTAM GAMBHIR”
ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మను తప్పించినట్లు వార్తలు రావడంతో హిట్మ్యాన్ ఫ్యాన్స్ కోచ్ గంభీర్పై మండిపడుతున్నారు. “RIP GAUTAM GAMBHIR” అనే హ్యాష్ట్యాగ్తో Xలో వేలాది ట్వీట్లు చేస్తున్నారు. 2021 నుంచి టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసింది రోహితే అని, ఇలా అవమానకరంగా తప్పించడం కరెక్ట్ కాదని పోస్టులు చేస్తున్నారు. గంభీర్ వచ్చాకే టీమ్ ఇండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్.
News January 2, 2025
తగ్గేదేలే.. 28 రోజుల్లో రూ.1799 కోట్ల వసూళ్లు
‘పుష్ప-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 రోజుల్లో రూ.1799కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక్క హిందీ వెర్షనే రూ.1000 కోట్లు వసూలు చేసింది. మరోవైపు బుక్ మై షోలో ఇప్పటివరకు 19.66M టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని సినీ వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్, రష్మిక నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.