News March 22, 2024
KCR నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా..!

KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.
Similar News
News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
News April 10, 2025
మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.
News April 10, 2025
భారీ వర్ష సూచన.. మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.