News November 19, 2024

KCR 10 ఏళ్ల పాలన అద్భుతం: హరీశ్ రావు

image

TG: KCR అంటే చరిత్ర అని, పదేళ్లు అద్భుతంగా పాలించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కేసీఆర్ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. కేశవ చంద్ర రమావత్ (KCR) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.

Similar News

News November 13, 2025

IRCTCలో 46 ఉద్యోగాలు

image

<>IRCTC <<>>సౌత్ సెంట్రల్ జోన్‌ పరిధిలో 46 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. BSc (హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ సికింద్రాబాద్‌లో ఈనెల 13, 14తేదీల్లో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com

News November 13, 2025

మెన్‌స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

image

ఒక మెన్​స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్​ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.

News November 13, 2025

కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్‌ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.