News April 27, 2024
అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం: రేవంత్

TG: రాష్ట్రంలో కరెంట్ కోతలంటూ కేసీఆర్ చేసిన <<13134472>>ట్వీట్పై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారు. మహబూబ్నగర్లోనూ ఇప్పుడు అవే అబద్ధాలు చెప్పారు. కేసీఆర్కు మరీ ఇంత అధికార దాహం ఎందుకు? ఓడిన తర్వాత కూడా ఆయనకు ఇంకా గర్వం తగ్గలేదు. రిజర్వేషన్లపై BRS వైఖరి ఏంటో కేసీఆర్ ప్రకటించాలి’ అని CM డిమాండ్ చేశారు.
Similar News
News December 6, 2025
హనుమాన్ చాలీసా భావం – 30

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 6, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.


