News September 19, 2025

కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

image

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.

Similar News

News February 4, 2026

USతో ట్రేడ్ డీల్.. వ్యవసాయం, డెయిరీకి పూర్తి రక్షణ: కేంద్రం హామీ

image

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత వ్యవసాయ, డెయిరీ రంగాలకు నష్టం వాటిల్లుతుందని వస్తోన్న విమర్శలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. ఇలాంటి సెన్సిటివ్ సెక్టార్స్‌కు పూర్తి రక్షణ కల్పించేలా డీల్ కుదుర్చుకొన్నామని పార్లమెంట్‌లో ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ సున్నితమైన అంశాలను రక్షించుకునేలాగే నియమ నిబంధనలను పొందుపర్చామని స్పష్టం చేశారు.

News February 4, 2026

‘వారణాసి’ మూవీకి నెట్‌ఫ్లిక్స్ రూ.650 కోట్ల ఆఫర్?

image

SS రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్‌ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

News February 4, 2026

అనిల్ అగర్వాల్ దాతృత్వం.. 75% సంపద దానం!

image

వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన మొత్తం ఆస్తిలో 75% సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. సుమారు $4.9B నికర విలువ కలిగిన ఆయన ప్రమోటర్ హోదా నుంచి వైదొలగి ఇకపై ట్రస్టీగా సేవలు అందించనున్నారు. ఇటీవల మరణించిన తన కుమారుడు అగ్నివేశ్ జ్ఞాపకార్థం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ₹15 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు.